కమల్ హాసన్‭కు అస్వస్థత

కమల్ హాసన్‭కు అస్వస్థత

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను చెన్నైలోని పోరూర్‌ రామచంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జ్వరంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతున్నారు. కమల్‌ ఇంతకుముందు కరోనా బారిన పడ్డారు. అప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తిరిగి ఇప్పుడు శ్వాస సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చేరారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఉండొచ్చని, అందుకే శ్వాస తీసుకోవ‌టంలో ఇబ్బందులు వ‌చ్చాయని తెలుస్తోంది.

ఇక నిన్ననే కమల్ హాసన్ హైదరాబాద్‭కు వచ్చారు. ప్రముఖ దర్శకుడు క‌ళా త‌ప‌స్వి కె.విశ్వనాథ్‭ని కలిసి.. సాయంత్రం తిరిగి చెన్నై వెళ్లిపోయారు. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కమల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కమల్ ప్రస్తుతం ఇండియన్ 2లో నటిస్తున్నారు.