ఎట్టకేలకు పూర్తయిన ఇండియన్2.. మరి గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి?

ఎట్టకేలకు పూర్తయిన ఇండియన్2.. మరి గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ గేమ్ ఛేంజర్(Game changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే దర్శకుడు శంకర్ కూడా గేమ్ ఛేంజర్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అందుకు తగ్గట్టుగానే ఆయన స్టైల్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. 

అయితే అనుకోని విధంగా కమల్ హాసన్ ఇండియన్2 షూట్ తెరపైకి రావడంతో.. రామ్ చరణ్ సినిమాను పక్కన పెట్టేసి ఇండియన్2 కి షిఫ్ట్ అయ్యారు శంకర్. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయ్యారు. ఎప్పుడెప్పుడు ఇండియన్2 షూట్ పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్నారు. చివరికి వారి ఎదురుచూపులు ఎండ్ కార్డు వేస్తూ.. ఇండియన్ 2 షూట్ కు కూడా ఎండ్ కార్డు వేశారు దర్శకుడు శంకర్. ఇండియన్2 షూట్ కంప్లీట్ అయినట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Also Read : భక్త కన్నప్ప ఆర్టిస్ట్రీ మేకింగ్‌ గ్లింప్స్ అదిరిపోయింది..

ఇండియన్2 కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇక గేమ్ ఛేంజర్ పైనే ఫోకస్ పెడతారు అనుకుంటూ తెగ సంబరపడుతున్నారు. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ షూట్ ఇంకా 30 శాతం పెండింగ్ ఉంది. అది కంప్లీట్ అవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి రామ్ చరణ్ సినిమా 2024 సంక్రాంతికి వచ్చే అవకాశం చాలా తక్కువ. మరి ఈ గేమ్ ఛేంజర్ ఎప్పుడు పూర్తి చేస్తాడో అనేది శంకర్ కె తెలియాలి.