
‘యుద్ధంలో గెలిచినవాడే కిరీటాన్ని ధరిస్తాడు. మేం మరోసారి మా టాలెంట్స్‌ని మీ ముందు ప్రదర్శించబోతున్నాం. మీరు కూడా మరోసారి మమ్మల్ని గెలిపించండి’ అంటున్నారు కమల్ హాసన్. తాను నటిస్తున్న రెండొందల ముప్ఫై రెండో మూవీ ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ నిన్న రిలీజైన సందర్భంగా కమల్ చెప్పిన మాటలివి. లోకేష్ కనకరాజ్ లాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్‌తో కమల్ వర్క్ చేయడమే ఒక విశేషమంటే.. ఆయనతో తలపడే విలన్స్‌గా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి వెర్సటైల్ యాక్టర్స్ నటించడం అంతకంటే పెద్ద విశేషం. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ చూశాక అవి మరింత పెరిగాయి. ముగ్గురు మహా నటులూ ఒక టిపికల్ లుక్‌లో ఉన్నారీ పోస్టర్‌లో. గుబురు మీసాలూ గడ్డాలూ.. తీక్షణమైన చూపులు.. ముఖాలకు గాట్లతో ముగ్గురూ చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. ఓ పెద్ద కేసులో ముఖ్య సాక్షిని కాపాడటానికి కమల్ ప్రయత్నిస్తుంటారని.. ఆ సాక్షిని చంపాలని చూసే విలన్‌గా ఫహాద్, అతనికి సాయపడే పోలీస్ ఆఫీసర్‌గా సేతుపతి కనిపిస్తారని సమాచారం. కథ ఏదైనా ముగ్గురు గ్రేట్ యాక్టర్స్ ఇలా ఒకే ఫ్రేమ్‌లోకి రావడమనేది మాత్రం అరుదైన విషయం.