
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) తో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ( Kamal Haasan ) భేటీ అయ్యారు. మరికొన్ని రోజుల్లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని తన నివాసంలో నా చిరకాల మిత్రుడు, సహచరుడు రజనీకాంత్ ను కలిశాను. రాజ్యసభలోకి అడుగుపెట్టనుండటంపై ఆనందాన్ని నా స్నేహితుడుతో పంచుకున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా కమల్ హాసన్ వెల్లడించారు.
ఈ సందర్భంగా తన పార్లమెంటు సభ్యుడి అపాయింట్ మెంట్ ను రజనీతో పంచుకోగా.. ఆయన కమల్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి మనస్ఫూర్తిగా అభినందించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన X ఖాతాలో షేర్ చేశారు. నా నూతన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు నా ఆనందాన్ని నాకెంతో ఇష్టమైన స్నేహితుడితో పంచుకున్నా. ఈ క్షణం నాకెంతో సంతోషంగా ఉంది అని కమల్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫిక్స్ వైరల్ అవుతున్నాయి.
ALSO READ : OTT Movies: ఈ వీకెండ్ (జూలై 16-20) ఓటీటీలోకి ఏకంగా 20కి పైగా సినిమాలు.. తెలుగులో 3 ఇంట్రెస్టింగ్..
புதிய பயணத்தை நண்பர் @rajinikanth உடன் பகிர்ந்தேன். மகிழ்ந்தேன். pic.twitter.com/n9R4HgsxlC
— Kamal Haasan (@ikamalhaasan) July 16, 2025
జూన్ లో డీఎంకే నేతృత్వంలోని కూటమి మద్దతుతో కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులోని డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించి ప్రచారం చేశారు. దీంతో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ్య సీటు ఇచ్చేందుకు డీఎంకే కూటమి హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా కమల్ హాసన్ ను రాజ్యసభకు సీటు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ్య సీటును కట్టబెట్టింది. ఈ నెల 25న పార్లమెంటులో రాజ్యసభ్య సభ్యునిగా కమల్ హాసన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన 'థగ్ లైపు' చిత్రంలో కమల్ హాసన్ నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం కమల్ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి.