ఆస్పత్రిలో చేరిన కమల్ హాసన్ 

 ఆస్పత్రిలో చేరిన కమల్ హాసన్ 

చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆస్పత్రిలో చేరారు. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవలే అమెరికాకు వెళ్లొచ్చిన ఆయన అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరానని ట్వటర్ లో కమల్ వెల్లడించారు. తమిళ భాషలో కమల్ హాసన్ వెల్లడించిన సారాంశం ఇలా ఉంది.
ఇటీవలే అమెరికా ట్రిప్ నుంచి తిరిగొచ్చాక కొంత అస్వస్థతకు గురయ్యా. వైద్య పరీక్షలు చేయించుకోగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు తేల్చారు. కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నా.. అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టి, అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు, టీవీషోలు చేస్తున్నారు. తమిళ బిగ్ బాస్ చేస్తున్న ఆయన ఇప్పుడు ఆస్పత్రిలో చేరడంతో షోకు కొంత విరామం ప్రకటిస్తారా..? ఆయన స్థానంలో ఎవర్ని ఎంపిక చేస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తమిళ్ లో ఆయన చేసిన ట్వీట్ ఇలా ఉంది..