It's Official : ప్రాజెక్ట్ -'కే' లో కమల్ హాసన్

It's Official : ప్రాజెక్ట్ -'కే' లో కమల్ హాసన్

నాగ్ అశ్విన్(Nag Ashwin) డైరక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ 'ప్రాజెక్ట్-K'. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ లో విశ్వనటుడు కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వీడియో రిలీజ్ చేశారు. 

స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వీడియో ను రిలీజ్ చేశారు. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఈ అప్డేట్ తో  ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇప్పుడు  ప్రాజెక్ట్K  సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తుండటంతో మరింతగా అంచనాలు పెరిగాయి. కమల్ హాసన్ ఈ మూవీ లో నటించడానికి ₹ 150 కోట్ల భారీ ఆఫర్‌తో టీమ్ సంప్రదించినట్లు వార్తలతో సోషల్ మీడియా సందడి చేస్తోంది .

ఈ మూవీలో దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అమితా బచ్చన్(Amitabh Bachchan) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కాగా ప్రాజెక్ట్K 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా సినిమాగా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ఎవెంజర్స్ తరహాలో ఉండబోతుందని సమాచారం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రాజెక్ట్K మూవీలో ప్రభాస్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది.