రెండు చోట్ల పోటీ చేయనున్నకమల్ హాసన్

రెండు చోట్ల పోటీ చేయనున్నకమల్ హాసన్

త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పోటీ చేసేందుకు పలు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పార్టీలు తమదైన శైలిలో దూసుకుపోతూ ఉన్నాయి. మక్కల్‌ నీది మయ్యం (MNM) అధినేత కమల్‌హాసన్ కూడా ఈ ఎన్నికల్లో తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు. తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా ..సీఎం అభ్యర్థిని తానేనని చెప్పేసిన కమల్ హాసన్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకు తగిన ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎంతో మంది నాయకులు ఇలా రెండు చోట్ల పోటీ చేశారు. ఇప్పుడు కమల్ హాసన్ కూడా అదే దారిలో వెళ్తున్నారు. ఆలందూర్‌, కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

MNM పార్టీ 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా 39 స్థానాల్లో పోటీచేసి ఓడిపోయింది. కేవలం నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి లక్షకు పైగా ఓట్లు వచ్చాయి.