
కమల్ హాసన్ హీరోగా ఫైట్ మాస్టర్స్ అన్బు అరివ్ దర్శకులుగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కమల్ కెరీర్‌లో ఇది 237వ సినిమా. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్.మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా, ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్టు అప్‌డేట్ అందించారు మేకర్స్. ఈ నేపథ్యంలో దర్శకులిద్దరితో కలిసి కమల్ దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మలయాళ స్ర్కీన్ రైటర్ శ్యామ్ పుష్కరన్‌తో సినిమాకు స్ర్కిప్ట్‌ను అందించారు. కంప్లీట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో కమల్ హాసన్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం రీసెంట్‌గా ‘లోక చాప్టర్ 1’తో సక్సెస్ అందుకున్న కళ్యాణి ప్రియదర్శన్‌ను ఎంపిక చేశారు. ఇతర నటీనటులను కూడా కొన్ని రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కమల్ హీరోగా నటించిన ‘విక్రమ్’ చిత్రానికి అన్బు- అరివ్ ఫైట్స్ కొరియోగ్రఫీ చేశారు. ఆ చిత్రానికి యాక్షన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడంతో వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ మూమెంట్‌ని ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటా’ అని చెప్పాడు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ‘డిస్ట్రిబ్యూటర్స్, ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మేము అనుకున్న దానికంటే డబుల్ రెస్పాన్స్ వస్తోంది. మా బ్యానర్‌లో మంచి సినిమా పడింది. ఇది వెరీ ప్రౌడ్ మూమెంట్’ అని అన్నారు. ఆడియెన్స్ రెస్పాన్స్ తమకు గొప్ప బలాన్ని ఇచ్చిందని కార్యక్రమంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ అన్నాడు.