వృద్ధులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​

వృద్ధులు సామాజిక  సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​

కామారెడ్డి టౌన్, వెలుగు : వృద్ధులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్​ పిలుపు ఇచ్చారు.   మంగళవారం  అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని  కామారెడ్డి జిల్లా కేంద్రంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ... తల్లిదండ్రులను పట్టించుకోని వారికి చట్టం అండగా నిలుస్తుందన్నారు. 

ప్రతీరోజు యోగా, వ్యాయమం చేస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు.  అనంతరం వృద్ధుల సంక్షేమ ఫోరం బిల్డింగ్​ ఆవరణలో మొక్కలు నాటారు. మున్సిపల్​చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ,  ఐసీడీఎస్​ జిల్లా పీడీ భావయ్య తదితరులు పాల్గొన్నారు.