కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీసీ నిర్వహించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. కామారెడ్డిలో 49 వార్డుల్లో 152 పోలింగ్ కేంద్రాలు, బాన్సువాడలో 19 వార్డుల్లో 39 పోలింగ్ కేంద్రాలు, ఎల్లారెడ్డిలో 12 వార్డుల్లో 24 పోలింగ్ కేంద్రాలు, బిచ్కుందలో 12 వార్డుల్లో 24 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
నామినేషన్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వెబ్ కాస్టింగ్, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పీవోలు, ఓపీవోల నియామకం, ఎన్నికల సామగ్రి, స్ర్టాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
స్కూల్స్లో టాయిలెట్స్ నిర్మాణాలు కంప్లీట్ చేయాలి
కామారెడ్డిటౌన్ : జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్లో ఉపాధిహామీ స్కీం కింద చేపట్టిన టాయిలెట్ నిర్మాణాలు కంప్లీట్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖ అధికారులతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. మార్కవుట్ ఇవ్వని చోట వెంటనే ఇవ్వాలని, మార్కవుట్ ఇది వరకే ఇచ్చి ఉంటే పనులు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్పీడప్ కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిపై రివ్యూ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీవో సురేందర్, డీఈవో రాజు, హౌజింగ్ పీడీ జయపాల్రెడ్డి, డీపీవో మురళీ తదితరులు పాల్గొన్నారు.
