- కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు: బాలికలు పోషకాహారం తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ సూచించారు. పోషకాహార మాసంలో భాగంగా గురువారం కామారెడ్డి మున్సిపల్‌పరిధిలోని టెకిర్యాల్ కస్తూర్బా, హైస్కూల్ లో రక్త హీనత పరీక్షల క్యాంపు నిర్వహించి స్టూడెంట్స్‌కు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. అన్ని స్కూల్స్‌లో కిషోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు చేయాలన్నారు.
బాలికలకు ఎప్పటికప్పుడు టెస్టులు చేసి రక్తహీనతతో ఉన్న వారిని గుర్తించి వారికి తగిన పోషకాహారం అందించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, ఐసీడీఎస్ జిల్లా పీడీ బావయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రంగనాథ్‌రావు, కౌన్సిలర్ శంకర్రావు, దేవునిపల్లి పీహెచ్సీ డాక్టర్ జోహా ముజీబ్తదితరులు పాల్గొన్నారు.
మహిళా శక్తి ప్రగతి సాధించాలి
రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పోగ్రాంలో ప్రగతి సాధించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎంపీడీవోలు, సెర్ప్ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా శక్తి పోగ్రాంలో రూరల్ ఏరియాలోని మహిళలకు తగిన ఉపాధి మార్గాల కోసం బ్యాంక్, స్ర్తీ నిధి ద్వారా లోన్లు ఇప్పించాలన్నారు. మండలాల వారీగా రివ్యూ మీటింగ్‌లు నిర్వహించి మరింత పురోగతి సాధించాలని సూచించారు. ప్రగతి సాధించని ఎంప్లాయీస్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీవో సురేందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికాంత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, స్త్రీనిధి జిల్లా మేనేజర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గురువారం ఎస్పీ సింధూశర్మతో కలిసి కలెక్టరేట్లో ప్రజాపాలన పోగ్రాం నిర్వహణపై ఆఫీసర్లతో మీటింగ్నిర్వహించారు. కలెక్టరేట్లో ప్రజా పాలన పోగ్రాం జరుగుతుంని, ఇందుకోసం ఆయా శాఖలకు కేటాయించిన పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.