బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​

కామారెడ్డి టౌన్, వెలుగు : ఎన్నికల్లో ఆయా శాఖల ఆఫీసర్లకు అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్​వి పాటిల్​ పేర్కొన్నారు. సోమవారం రిటర్నింగ్ ​ఆఫీసర్లు, తహసీల్దారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్​మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా 51 వేల మందికి ఓటరు కార్డులు వచ్చాయని, పంపిణీపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. చెక్​ పోస్టులపై నిఘా ఉంచాలన్నారు. పోలింగ్​ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. అడిషనల్​ కలెక్టర్లు చంద్రమోహన్, మనుచౌదరి, రిటర్నింగ్​ ఆఫీసర్లు శ్రీనివాస్​రెడ్డి, ప్రభాకర్, జడ్పీ సీఈవో సాయాగౌడ్ పాల్గొన్నారు.