తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డిటౌన్​, వెలుగు :   జిల్లాలో  ఎండ కాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని,    సమ్మర్ యాక్షన్​ ప్లాన్​ తయారు చేసుకోవాలని అధికారులకు కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో  జిల్లా అధికారులతో     తాగునీటి సప్లయ్​,  సమ్మర్ యాక్షన్​ ప్లాన్​,   ఉపాధి హామీ పనులు, భూ గర్భజలాల పెంపు,  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, బ్యాంక్​ లింక్​ తదితర ఆంశాలపై  రివ్యూ చేశారు. కలెక్టర్​ మాట్లాడుతూ..

పనుల్లో  నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.   పైపులైన్లు, మోటార్ల రిపేర్​ పనులు చేపట్టాలన్నారు.   అవసరమయితే ప్రత్యామ్నాయంగా తాగునీటి సప్లయ్​కు ఏర్పాట్లకు రెడీగా ఉండాలన్నారు.  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు టార్గెట్​ రీచ్​ కావాలన్నారు.    ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా  అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.  అడిషనల్ కలెక్టర్​ మదన్​మోహన్​,  సీఈవో చందర్,  డీఆర్డీవో సురేంధర్​ తో పాటు ఆయా శాఖల  జిల్లా, డివిజన్​, మండల స్థాయి  అధికారులు పాల్గొన్నారు.