ఆర్మూర్, వెలుగు: ఈనెల14, 15 తేదీల్లో హన్మకొండలో జరగనున్న 38వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాయ్స్ హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొనే నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల జట్టును గురువారం ఆర్మూర్ లో ఎంపిక చేశారు. ఎంపిక పోటీలకు రెండు జిల్లాలకు చెందిన స్కూల్స్, కాలేజ్ ల నుంచి120 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
ప్రతిభ కనబరిచినవారిని నిజామాబాద్ జిల్లా సబ్ జూనియర్ బాయ్స్ హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపిక చేసినట్లు జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగ మోహన్ చక్రు, ప్రధాన కార్యదర్శి పింజ సురేందర్ లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పేట సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి, గట్టడి రాజేష్, హాకీ సంఘం అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ, పీఈటీలు కొండ్రా అంజు, అజ్మాత్, సురేశ్, సంజీవ్, నవీన్, రహుల్, సీనియర్ హ్యాండ్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.