
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీ మెయిన్ రోడ్డుపై సోమవారం స్థానికులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. కొత్త బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు ఉన్న అశోక్‌నగర్ కాలనీ మెయిన్‌రోడ్డు గుంతలు పడి వెహికల్స్ రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని స్థానికులు పేర్కొన్నారు.
అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ రిపేర్లు చేయించటం లేదని, గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. మాజీ కౌన్సిలర్ ప్రభాకర్‌యాదవ్, జగదీశ్, శ్రీనివాస్, గంగరాం, దినేశ్‌రెడ్డి, నరేందర్ పాల్గొన్నారు.