తెలంగాణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

తెలంగాణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి : కాటిపల్లి వెంకటరమణారెడ్డి
  •     కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
  •     ఎస్ జీఎఫ్ ​రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ప్రారంభం

కామారెడ్డి టౌన్, వెలుగు :  తెలంగాణ క్రీడాకారులు నేషనల్, ఇంటర్నేషనల్​ స్థాయిలో రాణించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలోఎస్​జీఎఫ్​ రాష్ట్ర స్థాయి అండర్​14 బాలబాలికల హాకీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. పోటీలను ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి, కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్​తో కలిసి ప్రారంభించారు. రమణారెడ్డి మాట్లాడుతూ.. గతంలో హాకీ  ఇంటర్నేషనల్​ స్థాయిలో మనదేశానిదే హవా కొనసాగేదన్నారు.

మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్ ​మాట్లాడుతూ..  ఓటమితో అధైర్యపడకుండా ముందుకు సాగితేనే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. ఉమ్మడి 10  జిల్లాల నుంచి 405 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని ఎస్జీఎఫ్​జిల్లా సెక్రెటరీ రసూల్​ పేర్కొన్నారు. డీఈవో రాజు, పీఈటీలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.