కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి సీహెచ్వీఆర్ఆర్వరప్రసాద్తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్అబ్దూల్రహీం(20) ఆటో నడుపుతూ ఉండేవాడు. ఓ బాలికతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. 2022 ఆగస్టు 5న బాలికను ఢిల్లీకి తీసుకెళ్లాడు. ఇక్కడ కొద్ది రోజులు వివిధ ఏరియాలు తిప్పుతు ఆమెపై లైంగిక దాడి చేశాడు.
బాలిక కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు. నిందితుడు రహీంపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా జడ్జి గురువారం నిందితునికి 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
