కమ్మరిపేట తండా సర్పంచ్ ఏకగ్రీవం

కమ్మరిపేట తండా సర్పంచ్ ఏకగ్రీవం

కోనరావుపేట, వెలుగు: కమ్మరిపేట తండా సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్​కాగా.. భూక్య మంజుల ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమైంది. 4 వార్డులకు గానూ 3 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. ధర్మారంలో 2 వార్డులు, సుద్దాలలో 2, పల్లిమక్త లో 2, కనగర్తిలో 2, బావుసాయిపేటలో 2, మరిమడ్లలో 4 వార్డులు ఏకగ్రీవమైనట్లు గ్రామస్తులు తెలిపారు.

మంగపేట 8వ వార్డు మెంబర్.. 

గంగాధర, వెలుగు: మంగపేట జీపీ 8వ వార్డు మెంబర్​గా సీపీఐ గంగాధర మండల కార్యదర్శి షేక్​మౌలానా సతీమణి యాకూబ్ బీ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, గ్రామస్తులు ఆమెను సత్కరించారు.