సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కందాళ

సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కందాళ

కూసుమంచి, వెలుగు : 27న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామ సమీపంలో జరిగే సీఎం కేసీఆర్​బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​రెడ్డి పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఇటీవల పోచారం గ్రామానికి చెందిన పుట్ట లచ్చమ్మ ఇటీవల మృతి చెందగా ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె ఫొటోకు నివాళులర్పించారు.