SRH ఫ్యాన్స్కు షాక్..ఐపీఎల్ మినీ వేలంలోకి కేన్ మామ

SRH ఫ్యాన్స్కు షాక్..ఐపీఎల్ మినీ వేలంలోకి కేన్ మామ

కెప్టెన్ కేన్ మామను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసింది. రిటెన్షన్ విధానంలో భాగంగా  కేన్ విలియమ్సన్‌ SRH యాజమాన్యం రిలీజ్ చేసింది. కేన్తో పాటు.. నికోలస్ పూరన్‌ వేలానికి పంపింది. ఐపీఎల్ 2023 రిటెన్షన్ ప్రక్రియకు గడువు ముగియడంతో రిటైన్ చేసుకున్న ప్లేయర్ల లిస్టును SRH ప్రకటించింది. వచ్చే సీజన్ కోసం 12 మందిని  మాత్రమే రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. మిగతా ఆటగాళ్లను మినీ వేలంలోకి విడుదల చేసింది. 

SRH రిటైన్ జాబితా...


2023 ఐపీఎల్ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తం 12 మందిని రిటైన్ చేసుకుంది. ఇందులో ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ, భువీలను రిటైన్ చేసుకుంది. కెప్టెన్  కేన్ విలియమ్సన్తో పాటు..నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్‌లను మినీ వేలంలోకి రిలీజ్ చేసినట్లు ట్విటర్లో  పేర్కొంది. అయితే ఇన్నాళ్లు జట్టును ముందుండి నడిపిన కేన్ మామకు SRH ధన్యవాదాలు తెలిపింది. కేన్ ఎప్పటికీ తమ వాడే అంటూ క్యాప్షనిచ్చింది. 

అప్పుడు రూ. 14 కోట్లకు రిటైన్...
ఐపీఎల్ 2022 వేలంలో కేన్ విలియమ్సన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే ఈ సీజన్లో అతను ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆటగాడిగా..కెప్టెన్గా విఫలమయ్యాడు. కేన్తో పాటు..గత వేలంలో రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసిన  నికోలస్ పూరన్‌,  రూ.7.75 కోట్లకు తీసుకున్న రొమారియో షెఫార్డ్లు సైతం స్థాయికి తగ్గట్లు  రాణించలేకపోయారు. దీంతో  ఈ ముగ్గురిని అతన్ని కూడా జట్టు వదులుకుంది. ఈ ముగ్గురిని వదిలేయడం వదిలేసిన సన్‌రైజర్స్.. పర్స్‌కు రూ. 32.5 కోట్లు యాడ్ చేసుకుంది.