దిమాక్ ఉన్నోళ్లకే నా ట్వీట్లు అర్థమైతయ్

దిమాక్ ఉన్నోళ్లకే నా ట్వీట్లు అర్థమైతయ్

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ మీద కంగన చేసిన కామెంట్ కూడా వైరల్ అయ్యింది. బైడెన్ చైనా తయారు చేసిన ప్రెసిడెంట్ అని.. ఆయనో కమ్యూనిస్ట్ అని కంగన ట్వీట్ చేసింది. చైనా చేతిలో బైడెన్ కీలుబొమ్మ అంటూ ఆరోపించింది. అయితే తన ట్వీట్లు అందరికీ అర్థం కావని మరో ట్వీట్ చేసింది. దిమాగ్ ఉన్నవారికే అర్థమవుతాయని పేర్కొంది. అందరికీ అర్థమయ్యేలా వాటి గురించి వివరించలేనని స్పష్టం చేసింది.