
బాలీవుడ్(Bollywood) క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) కొన్ని వరుస పరాజయాలతో ఇటీవల తీవ్ర నిరాశలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలు పెట్టుకున్న తలైవి,చంద్రముఖి 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లయ్యాయి. దీంతో ఈ భామ తదుపరి చిత్రం తేజస్ (Tejas) పైనే హోప్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
లేటెస్ట్గా తేజస్ టీజర్‌ను ఇవాళ(Oct 2 న) గాంధీ జయంతి సందర్భంగా స్వయంగా కంగన రిలీజ్ చేసింది. ఈ మూవీలో కంగన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ తేజస్ గిల్‌గా నటించారు. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో..చక్కని కథా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో కంగన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మన దేశంపై ప్రేమ కోసం..తేజస్ టేకాఫ్ కు సిద్ధమవుతోందని టీజర్లో చూపించారు. ఈ టీజర్లో కంగన వైమానిక దళ కమాండర్గా కనిపించింది. దేశం కోసం పోరాడిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా కంగన లుక్ కూడా యాప్ట్ గా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది అంటూ.. కంగన వ్యాఖ్యానించింది.
సర్వేశ్ మెవరా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ దేశభక్తి కాన్సెప్ట్ తో వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దసరా బరిలో అక్టోబర్ 27న తేజస్ రావడానికి సిద్ధం అంటూ మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాకి వారం రోజులు ముందుగా దసరా బరిలో పెద్ద హీరోలా సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో, శివరాజ్ కుమార్ ఘోస్ట్ సినిమలతో పాటు బాలీవుడ్ లో గణపథ్ ఉంది. చాలా బీభత్సమైన పోటీలో కంగనా ఈ సారైనా నిలబడుతుందో..లేదో చూడాలి.
Ready to take off for the love of our nation! Bharat ko chhedoge toh chhodenge nahi. ???
— Kangana Ranaut (@KanganaTeam) October 2, 2023
Trailer out on Indian Air Force Day, 8th October. #TejasTeaser #BharatKoChhedogeTohChhodengeNahi #Tejas In cinemas on 27th Oct.@sarveshmewara1 @RSVPMovies @RonnieScrewvala @IAF_MCC… pic.twitter.com/HdylJaGNEn