
జైలర్ సక్సెస్తో రజినీ కాంత్(Rajinikanth) తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. తలైవర్170 (Thalaivar170) గా వస్తోన్న ఈ మూవీని జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్(Tj Gnanavel) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటించనున్నారని తెలుస్తోంది.
లేటెస్ట్గా ఈ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో చాలా కీలకమైన రోల్స్ కోసం ఇద్దరు స్ట్రాంగ్ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇందుకోసం బోల్డ్ అండ్ డైనమిక్ పర్ఫార్మర్ రితికా సింగ్( Ritika Singh), తమిళ యాక్టర్ దుషార విజయన్(Dushara vijayan) తలైవర్ 170 లో నటిస్తున్నట్లు తెలిపారు.
పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన సార్పట్టా పరంపరై(Sarpatta Paramparai) సినిమా చూసిన వారు దుషారాను అంత తొందరగా మర్చిపోలేరు. హీరో ఆర్యకు(arya) జంటగా నటించిన దుషారా అద్భుతమైన నటనను కనబరిచింది. వెంకటేష్ గురు మూవీతో రితికాసింగ్ తెలుగులో సుపరిచితమే. ఇందులో రజినీకి జోడీగా దీపికా పదుకునే నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ : వందే భారత్కు తప్పిన పెను ప్రమాదం
ఇక, 72 సంవత్సరాల వయసులోనూ రజినీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తలైవా 170 మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ ఎంతో గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. జైలర్ మూవీకి అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేసిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. జైభీమ్ వంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన డైరెక్టర్ జ్ఞానవేళ్.
ఈ మూవీలో రజినీకాంత్‌ను స్క్రీన్‌పై ఎలాంటి క్యారెక్టర్ లో చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేజ్రీ మూవీలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, కోలీవుడ్ బ్యూటీ మంజు వారియర్ ముఖ్య పాత్రలలో నటించబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఈ మూవీలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని క్యామియో రోల్ చేస్తున్నట్టు సమాచారం. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీని 2024 లో రిలీజ్ చేస్తున్నారు.
Welcoming the talented actress Ms. Dushara Vijayan ✨ on board for #Thalaivar170??#Thalaivar170Team has gotten stronger with the addition of the wonderful @officialdushara ???@rajinikanth @tjgnan @anirudhofficial @RIAZtheboss @V4umedia_ @gkmtamilkumaran @LycaProductions… pic.twitter.com/s1dXzNpGBr
— Lyca Productions (@LycaProductions) October 2, 2023
Welcoming the bold performer ? Ms. Ritika Singh ✨ on board for #Thalaivar170??#Thalaivar170Team has gotten grittier ?? with the addition of @ritika_offl ???@rajinikanth @tjgnan @anirudhofficial @officialdushara @RIAZtheboss @V4umedia_ @gkmtamilkumaran @LycaProductions… pic.twitter.com/QN3AWAhOd7
— Lyca Productions (@LycaProductions) October 2, 2023