వందే భారత్కు తప్పిన పెను ప్రమాదం

వందే భారత్కు తప్పిన పెను ప్రమాదం

వందే భారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో వేలాది మంది ప్రయాణికులు ప్రాణాలు రక్షించబడ్డాయి. కొందరు దుండగులు వందే భారత్ రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర చేశారు. వందే భారత్ ప్రయాణించే రైల్వే ట్రాక్ పై రాళ్లు, ప్రత్యేక రాడ్లు అడ్డగా పెట్టారు. దీన్ని గమనించిన రైల్వే సిబ్బంది..వందే భారత్ రైలు లోకో పైలెట్ ను అప్రమత్తం చేసి రైలును ఆపారు. వివరాల్లోకి వెళ్తే..

ALSO READ : కేసులు పెట్టినా తగ్గేదేలే .. బీఆర్ఎస్కు మైనంపల్లి వార్నింగ్


రాజస్థాన్‌ రాష్ట్రంలోని భిల్వారా సమీపంలో ఉదయపూర్ - జైపూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పించేందుకు కొందరు దుర్మార్గులు.. రైల్వే ట్రాక్‌పై  ప్లాన్ చేసి రాళ్లు, రాడ్లు పెట్టారు. చిత్తౌర్ గఢ్ జిల్లా గంగారార్ పరిధిలోని భిల్వారా సమీపంలో కొందరు వ్యక్తులు..ట్రాక్ పై రాళ్లు పేర్చారు. ట్రాక్ లోని ఇనుప ప్లేట్ ల మధ్యలో  అడుగు పొడవు గల రెండు రాడ్ లను చొప్పించారు.  అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి.. రైలును ఆపేశారు.


 
విషయాన్ని తెలుసుకున్న భిల్వారా సీనియర్ సెక్షన్ ఇంజనీర్, స్థానిక పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  రాళ్లు, రాడ్లను తొలగించారు. ఆ తర్వాత వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముందుకు కదలింది. ఈ ఘటనకు  సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.