కంగన ట్వీట్​తో ముంబై షేక్

కంగన ట్వీట్​తో ముంబై షేక్

సిటీని పీఓకేతో పోల్చడంపై విమర్శలు

హీరోయిన్​ను తప్పుపడుతున్న బాలీవుడ్​

ఆమెకు సిటీలో ఉండే హక్కులేదన్న హోంమినిస్టర్

అయినా వెనక్కి తగ్గని కంగనా

‘సంజయ్​ రౌత్, శివసేన నన్ను బెదిరించిన్రు. ముంబైకి రావొద్దంటున్నరు. సిటీ వీధుల్లో ఆజాదీ గ్రాఫిటీల నుంచి ఇప్పుడీ బెదిరింపుల దాకా.. ముంబై ఎందుకు పాక్​ ఆక్రమిత కాశ్మీర్​లా అనిపిస్తోంది?’

– బాలీవుడ్​ ఫైర్​బ్రాండ్​గా పేరొందిన కంగనా రనౌత్​ చేసిన ట్వీట్​ ఇది..

ఇప్పుడీ ట్వీట్​పై దుమారం రేగుతోంది. ముంబై సిటీ షేక్​ అవుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఆమెను తప్పుబడుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు పొలిటీషియన్లు కూడా ఆమె కామెంట్స్ పై మండిపడుతున్నారు. ‘ముంబై లేదా మహారాష్ట్రలో తనకు రక్షణ లేదని కంగనా రనౌత్ అనుకుంటే.. ఆమెకు ఇక్కడ ఉండే హక్కు లేదు’ అని మహారాష్ట్ర హోంమంత్రి అనీల్ దేశ్ ముఖ్ స్పష్టం చేశారు. ముంబై పోలీసులను అప్రతిష్టపాలు చేస్తున్న కంగనపై చర్యలు తీసుకోవాలని శివసేన నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ముంబై, ముంబైకర్లు, మహారాష్ట్రకు కంగన పాఠాలు నేర్పాల్సిన పనిలేదని బీజేపీ నేత ఆశిశ్ శేలార్ అన్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కంగన కామెంట్లపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. అన్ని వైపులా విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని కంగన.. ‘ముంబై వస్తున్నా దమ్ముంటే అడ్డుకోండి’ అని సవాల్ చేశారు.

మెంటల్ కేసులు పెరుగుతున్నయ్: సంజయ్

ముంబై పోలీసుల ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్న వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని మహారాష్ర్ట ప్రభుత్వాన్ని సంజయ్ రౌత్ కోరారు. ‘‘నేను పేర్లు చెప్పను. బెదిరించను. నేను శివ సైనిక్‌‌ని కాబట్టి యాక్షన్ ను మాత్రమే నమ్ముతా. పెరుగుతున్న మెంటల్ కేసులను రాష్ట్ర ఆరోగ్య శాఖ, హోం శాఖ పరిష్కరించాలి. చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి’’ అని కామెంట్ చేశారు. పోలీసులు ముంబైని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడారన్నారు. ముంబై పోలీసుల ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

వచ్చే వారం వస్తున్నా.. కంగనా

ఇప్పుడుహిమాచల్​ ప్రదేశ్​లో ఉన్న కంగన.. తన కామెంట్లను సమర్థించుకున్నారు. ‘‘ముంబైకి తిరిగి రావొద్దని చాలామంది బెదిరిస్తున్నారు. కానీ ఈ నెల 9న ముంబైకి వెళుతున్నా’ అని చెప్పారు.

For More News..

సీఎస్కేకు వరుస షాకులు.. రైనా దారిలో భజ్జీ

పాసైనా ఫాయిదా లేకపాయె!

సగం స్టాఫ్​, సగం శాలరీస్​తో… ప్రైవేట్​ స్కూళ్లు