అక్టోబర్‌‌‌‌ రెండో వారంలో కంగువ విడుదల

అక్టోబర్‌‌‌‌ రెండో వారంలో కంగువ విడుదల

కొత్త తరహా చిత్రాలతో తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ పెంచుకున్న సూర్య... ప్రస్తుతం ‘కంగువా’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ పీరియాడికల్ యాక్షన్‌‌ డ్రామాకు శివ దర్శకుడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సమ్మర్‌‌‌‌లోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే గ్రాఫిక్స్‌‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడం, త్రీడీలో తెరకెక్కిస్తుండడం, ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తుండడంతో పోస్ట్ ప్రొడక్షన్‌‌కు ఎక్కువ సమయం పట్టనుంది.

దీంతో ఈ ఏడాది సెకెండాఫ్‌‌లో రిలీజ్‌‌ చేయాలనుకుంటున్న మేకర్స్.. దసరాకు థియేటర్స్‌‌కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ లెక్కన అక్టోబర్‌‌‌‌ రెండో వారంలో విడుదల కానుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్‌‌ అనౌన్స్‌‌మెంట్ రానుంది. సూర్య కెరీర్‌‌‌‌లో ఇది 42వ చిత్రం. దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్‌‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.