
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు ఐదోసారి కూడా కరోనా ( కోవిడ్ – 19 ) పాజిటివ్‌గా నమోదైంది. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం కనికా కపూర్ ఉత్తర ప్రదేశ్ లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతుంది. పది రోజుల క్రితం ఆమెకు కరోనా సోకింది. ఆ తర్వాత కూడా కనికా కపూర్ పలు పార్టీలకు అటెండ్ అయింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కరోనా వ్యాధి సోకిన వారికి మూడోసారి టెస్ట్ చేసినపుడు చాలా మట్టుకు నెగిటివ్ వస్తదని అయితే కనికా కపూర్ విషయంలో మాత్రం ఐదవసారి కూడా పాజిటివ్ రావడంతో డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.
సోమవారం కనికా కపూర్ తన సోషల్ మీడియా ఎకౌంట్‌లో తనకు కరోనా నెగిటివ్ రావాలని కోరుకున్నారు. దాంతోపాటు ఓ కొటేషన్ ను పోస్ట్ చేశారు. “జీవితం సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని నేర్పుతుంది, సమయం మనకు జీవిత విలువను బోధిస్తుంది” అని ఒక కోట్‌ను ఆమె పంచుకుంది. ప్రతీ ఒక్కరు ఇంట్లో సురక్షితంగా ఉండాలని కోరుకుంది కనికా కపూర్. ఐదవ సారైనా కరోనా టెస్ట్ లో నెగిటివ్ రావాలని అనుకుంది. అయితే అందుకు విరుద్దంగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.