ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్

ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప మర్డర్ కేసులో అరెస్టయ్యారు. మంగళవారం మైసూరులో దర్శన్ తూగుదీపతో పాటు మరో పదమూడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు. జూన్ 9న రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడు దర్శన్ పేరు వెల్లడించాడని పోలీసులు చెప్పారు. దాంతో ఆయనను కస్టడీలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. హత్యలో నటుడి ప్రత్యక్ష ప్రమేయం ఉన్నదా..లేదా కుట్రలో భాగమేనా అనే వివరాలు రాబడుతున్నట్లు చెప్పారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మృతుడు ఓ సినీనటికి అసభ్యకరమైన మెసేజులు పంపినట్లు తెలిసింది. ఆ నటిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆర్ఆర్ నగర్ లోని దర్శన్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. 2002లో మాజెస్టిక్ చిత్రంతో హీరోగా తన ప్రయాణం మొదలుపెట్టిన దర్శన్ తూగుదీప.. తర్వాత పలు హిట్ చిత్రాలతో పాపులర్ అయ్యారు. గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.