
కన్నడ నటుడు దేవరాజ్‌కు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయన పెద్ద కుమారుడు ప్రజ్వల్ దేవరాజ్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటికే కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ప్రజ్వల్.. తాజాగా ఓ పాన్ ఇండియా మూవీని ప్రకటించాడు. ‘జాతర’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. గోవర్థన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ ‘సినిమాలో ప్రేమకథ ఎంత అందంగా ఉంటుందో... నేపథ్యం కూడా అంతే కొత్తగా ఉంటుంది. అందరూ మెచ్చేలా కథ, కథనం ఉంటాయి. త్వరలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు వెల్లడిస్తాం’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఆగస్టులో షూటింగ్ మొదలుపెట్టి.. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. బళ్ళారి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం’ అని చెప్పారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.