ఎండను సైతం లెక్క చేయని భక్తులు.. నల్లమల అడవిలో పాదయాత్ర..

ఎండను సైతం లెక్క చేయని భక్తులు.. నల్లమల అడవిలో పాదయాత్ర..

శ్రీశైలంలో ఉగాది సందర్బంగా ఈనెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు.ఈ క్రమంలో నల్లమల అడవిలో కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాది తరలివస్తున్నారు నల్లమల అంత ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది. ఉగాది పండుగ సమీపిస్తుండటంతో శ్రీశైల మల్లన్న దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలానికి చేరుకుంటున్నారు. నల్లమల అడవి ద్వారా కాలినడకన వస్తున్న భక్తులకు దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. 

కర్నాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు పాదయాత్రగా వస్తుండటంతో  భక్తుల భజనలతో అటవీ ప్రాంతం అంతా మార్మోగుతోంది.ఈ క్రమంలో కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు దారి వెంట ట్రాక్టర్లతో నీరు చల్లడం,వచ్చే భక్తులకు మార్గమధ్యలో దేవస్థానం సహకారంతో స్వచ్చంద సేవకర్తలతో అన్నదాన ఏర్పాటు చేయటం వంటి సౌకర్యాలు కల్పించారు అధికారులు.ఎండను సైతం లెక్కచేయకుండా మండుటెండలో ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుండి దట్టమైన అటవీప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటున్న వస్తున్న పాదయాత్ర కన్నడ భక్తుల కోసం పలువురు దాతలు కూడా మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టి పెట్టడం పట్ల తమ సంతోషం వ్యక్తం చేశారు కన్నడ భక్తులు.