ఇంగ్లీష్ బోర్డులు పీకిపారేస్తున్న కన్నడ రక్షణ దళం

ఇంగ్లీష్ బోర్డులు పీకిపారేస్తున్న కన్నడ రక్షణ దళం

దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తమ సైన్ బోర్డుల్లో స్థానిక కన్నడ బాషనే ఉపయోగించాలని ఇటీవలే బెంగళూర్ బృహత్ మున్సిపాలిటీ పాలికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బెంగళూరులో కన్నడ రక్షా వేదిక ఓ హోటల్ ను ధ్వంసం చేయడంతో.. వారు చేపట్టిన నిరసన కాస్తా హింసాత్మకంగా మారింది.
 
ఫిబ్రవరి 28, 2024లోగా రాజధాని నగరంలోని వాణిజ్య సంస్థలు తమ నేమ్ బోర్డులపై 60 శాతం కన్నడ భాషను ఉపయోగించాలని, లేదంటే తమ ట్రేడ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని BBMP ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిబంధన తమకు తెలియదని, అందుకే పాటించడం లేదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు.