కేన్స్‌‌‌‌లో ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

కేన్స్‌‌‌‌లో ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌‌‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్‌‌‌‌ లాల్, శివరాజ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సోమవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌లో రిలీజ్ చేశారు.  ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’ పేరుతో విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా కేన్స్ ఫెస్టివల్‌‌‌‌లో కన్నప్ప టీం సందడి చేసింది. మోహన్ బాబు, విష్ణు,  ప్రభుదేవా హాజరయ్యారు. 

అలాగే  మే 30న తెలుగులో, జూన్ 13న మిగిలిన భాషల్లో  ‘కన్నప్ప’ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు విష్ణు ప్రకటించాడు. కేన్స్‌‌‌‌లో తమ చిత్రం టీజర్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్న మంచు విష్ణు.. టీజర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని,  ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్లు, అక్కడికి వచ్చిన ఇండియన్స్ టీజర్‌‌‌‌ను చూసి ప్రశంసించడం హ్యాపీగా ఉందన్నాడు. ‘మహాభారతం’ టీవీ సిరీస్‍ను తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మోహన్ బాబు నిర్మిస్తున్నారు.  బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, శరత్‍కుమార్, దేవరాజ్, ఐశ్వర్య, ముకేశ్ రుషి ఇతర పాత్రలు  పోషిస్తున్నారు.