ఓటీటీలో అదరగొడుతున్న ఇన్వెస్టిగేటివ్ కాప్ థ్రిల్లర్..ఇదేమి రెస్పాన్స్ బాబోయ్

ఓటీటీలో అదరగొడుతున్న ఇన్వెస్టిగేటివ్ కాప్ థ్రిల్లర్..ఇదేమి రెస్పాన్స్ బాబోయ్

సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఎంతోమందికి ఫేవరేట్ యాక్టర్ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty). లేటెస్ట్గా ఆయన నటిస్తూ..నిర్మించిన చిత్రం క‌న్నూర్ స్క్వాడ్‌ (Kannur Squad). గత నెల 2023 సెప్టెంబ‌ర్ 28న విడుద‌లైన ఈ సినిమా మలయాళ బాక్సాఫీసును దుమ్ము దులిపేసింది. 

రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన క‌న్నూర్ స్క్వాడ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇన్వెస్టిగేటివ్ కాప్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ కన్నూర్ స్క్వాడ్..చూస్తున్నంత సేపు కార్తి నటించిన ఖాకీ, లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన రాఘవన్ మూవీ గుర్తొస్తుంది. నిజజీవిత సంఘటనలను కళ్ళకు కట్టినట్లుగా చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్లో..క‌న్నూర్ స్క్వాడ్‌ సోషల్ మీడియా ట్రేండింగ్లో టాప్ 1 స్థానంలో ఉంది. 

ఈ మూవీలో మమ్ముట్టి జార్జ్ మార్టిన్ క్యారెక్టర్లో నటించి కెరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. సాక్షాలు లేని కేసులో..తన ప్రతిభను మాత్రమే చూపిస్తూ..ఎటువంటి హీరోయిజం, ఎలివేషన్ సీన్స్ లాంటి ఎక్సట్రా అక్టీవిటీస్ లేకుండా కథలో ఇన్వాల్వ్ చేసే సీన్స్ ఆడియాన్స్ను కట్టిపడేస్తున్నాయి.

ముఖ్యంగా కథ సాగుతున్నంతసేపు నేరస్థులను పట్టుకోవడానికి పోలీస్ ప్రొసీడింగ్స్ గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో సహజమైన విజువల్స్ తో పాటు పోలీసు యాక్టర్స్ చేసిన వారి పర్ఫామెన్స్ చాలా నాచురల్గా డిజైన్ చేశారు. మమ్ముట్టి ప్రతి ఫ్రేమ్లో తన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆడియన్స్ని ఫిదా చేశారు. ఈ సినిమాలో చూపించిన తన హావభావాలు ఆయన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. వీటితోపాటు సుషిన్ శ్యామ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. ఇటువంటి ఇంటెన్స్ పెంచే మూవీస్ చాలా అరుదుగా వస్తాయి.ఆలస్యం చేయకుండా చూసి ఎంజాయ్ చేయండి.