
న్యూఢిల్లీ: సిమెంట్ తయారీ కంపెనీ కనోడియా సిమెంట్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దగ్గర ప్రిలిమినరీ పేపర్స్ ఫైల్ చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూలో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ఉంటుంది. అంటే ప్రమోటర్స్, ఒక ఇండివిడ్యువల్ షేర్‌హోల్డర్‌లు కలిపి 1.49 కోట్ల షేర్లను అమ్మనున్నారు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ఉండదు.
కనోడియా సిమెంట్ ఉత్తర ప్రదేశ్, బిహార్‌లలో సాటిలైట్ గ్రైండింగ్ యూనిట్స్ (ఎస్‌జీయూ) ద్వారా సిమెంట్ తయారు చేస్తోంది. ఇతర బ్రాండ్ల కోసం కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ పద్ధతిలో సిమెంట్ తయారు చేస్తోంది. అలానే తన సొంత బ్రాండ్‌ను ఆపరేట్ చేస్తోంది. కిందటేడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ తయారీ సామర్ధ్యం 3.54 ఎంటీపీఏ (మిలియన్ టన్స్ పర్ అనమ్) గా ఉంది. ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఐఐఎఫ్‌ఎల్ క్యాపిటల్ సర్వీసెస్, వన్‌వ్యూ కార్పొరేట్ అడ్వైజర్స్ ఈ ఇష్యూకు బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్స్‌గా పనిచేస్తున్నాయి.