
కాంతారా 2(Kantara 2) మూవీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కాంతారా మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 27 నుండి మొదలు కానుందని సమాచారం. ఇక మొదటి పార్టీ ను డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి(Rishab shetty)నే ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.
కాంతారా మొదటి భాగం భారీ సక్సెస్ సాధించిన నేపధ్యంలో ఈ సినిమా ప్రీక్వెల్ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు రిషబ్ శెట్టి.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేయనున్నారట మేకర్స్. మొదటి భాగం కోసం కేవలం రూ. 16 కోట్లు ఖర్చు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు కాంతారా రెండవ భాగం కోసం మేకర్స్ రూ.80 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని సమాచారం. దీంతో ఈ సినిమాపై ఇప్పటినుండే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్( Hombale films) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.