ఓటీటీలోకి కాంతార సినిమా

ఓటీటీలోకి కాంతార సినిమా

రిషబ్ షెట్టి హీరోగా, డైరెక్టర్ గా తెరకెక్కించిన రీసెంట్ బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్ కాంతార సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఓటీటీ ప్రేక్షకుల ఎదురుచూపులకు తెరదించుతూ రేపు (నవంబర్ 24) అమెజాన్ ప్రైమ్ లో అన్ని భాషల్లో అందుబాటులోకి రానుంది. 

ఎలాంటి అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్స్ హడావిడీ లేకుండా తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార, రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. కేవలం రూపాయలు 16 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా రూపాయలు 400.90 కోట్ల వసూళ్లను రాబట్టింది. కాంతార సినిమాలో కర్ణాటక తుళునాడు సంస్కృతి, భూతకోల సంప్రదాయం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈ సినిమాలో రిషబ్ షెట్టి తన నట విశ్వరూపాన్ని చూపించాడు.