HariHaraVeeraMallu : 'హరిహర వీరమల్లు' : అమెరికాలో పవన్ క్రేజ్.. ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ రికార్డులు బద్దలు!

HariHaraVeeraMallu : 'హరిహర వీరమల్లు' : అమెరికాలో పవన్ క్రేజ్..  ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ రికార్డులు బద్దలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు' (HariHaraVeeraMallu) చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.   ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ  సినిమా విడుదల కావడానికి ఇంకా 12 రోజులు ఉన్నప్పటికీ, యు.ఎస్.ఎ. (USA) లో ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ (Premiere Advance Sales) ఇప్పటికే రికార్డులను తిరగరాస్తున్నాయి. అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.   ఇప్పటి వరకు ఉన్న  సమాచారం ప్రకారం, 'హరిహర వీరమల్లు' యు.ఎస్.ఎ. ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ $105,329కి చేరుకున్నాయి. ఇది 285 లొకేషన్లలో, 736 షోలకు, 3791 టిక్కెట్లు అమ్ముడుపోవడం విశేషం.

ఊహించని రీతిలో కలెక్షన్లు ?
సాధారణంగా పెద్ద సినిమాలకు కూడా ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ ఇంత త్వరగా ఈ స్థాయికి చేరడం అరుదు. అయితే 'హరిహర వీరమల్లు' విషయంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ వేగం పుంజుకుంటోందని, రాబోయే రోజుల్లో అమ్మకాలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా, 'రీగల్' (Regal) వంటి పెద్ద థియేటర్ చైన్ ఇంకా పూర్తిస్థాయిలో తమ బుకింగ్స్ తెరవలేదు. అవి కూడా అందుబాటులోకి వస్తే, కలెక్షన్లు ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉంది.

 

'హరిహర వీరమల్లు' ఫీవర్ షార్లెట్‌లో పతాక స్థాయికి!
సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా, యు.ఎస్.ఎలోని షార్లెట్ (Charlotte) నగరంలో 'హరిహర వీరమల్లు' ఫీవర్ పతాక స్థాయికి చేరుకుంది. సినిమా విడుదల కావడానికి ముందే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. సాధారణంగా ప్రీమియర్ల కోసం ఈ స్థాయిలో హడావిడి కనిపించదు. పవన్ కళ్యాణ్ మేనియా ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేస్తూ, షార్లెట్‌లోని అభిమానులు సినిమా కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది కేవలం ఒక్క నగరం పరిస్థితి మాత్రమే కాదు, యు.ఎస్.ఎ.లోని ఇతర నగరాల్లో కూడా ఇదే రకమైన ఉత్సాహం కనిపిస్తోంది.

భారీ సెట్టింగ్‌లు, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు.
ఈ చిత్రానికి  దర్శకుడు క్రిష్ జాగర్లమూడి , ఎఎం జ్యోతి కృష్ట దర్శకత్వం వహించారు.  పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామాలో కనిపించడం, భారీ సెట్టింగ్‌లు, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు,  గ్రాఫిక్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. నిధి అగర్వాల్, నోరా ఫతేహి వంటి నటీమణులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే, బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది . ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడికల్ చిత్రం కావడంతో అభిమానుల్లో ఆతృత రెట్టింపు అయ్యింది. సెన్సేషనల్ ప్రీమియర్ సేల్స్‌తో 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా పయనిస్తోంది. థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే సీడెడ్‌లో అమ్ముడుపోవడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..