కాంత మూవీ విడుదల వాయిదా... దీపావళికి రిలీజయ్యే ఛాన్స్.. !

కాంత మూవీ విడుదల వాయిదా... దీపావళికి  రిలీజయ్యే ఛాన్స్.. !

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌‌ ఇటీవల తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాడు వీటిలో ‘కాంత’ కూడా ఒకటి.  సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.  సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నాడు.  శుక్రవారం ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.  అయితే సినిమా రిలీజ్‌‌ను వాయిదా వేస్తున్నట్టు హీరో, నిర్మాత దుల్కర్ సల్మాన్‌‌ ప్రకటించాడు. 

తను నిర్మాతగా రూపొందించిన ‘లోక: ఛాప్టర్ 1 చంద్ర’ సక్సెస్‌‌ఫుల్‌‌గా థియేటర్స్‌‌లో రన్‌‌ అవుతోందని, ఆ విజయయాత్రను కొనసాగించడానికి ‘కాంత’ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్టు తెలియజేశాడు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.