సుమన్‌‌‌‌‌‌‌‌కు కాంతారావు అవార్డు

సుమన్‌‌‌‌‌‌‌‌కు కాంతారావు అవార్డు

అలనాటి నటుడు కాంతారావు శతజయంతి సందర్భంగా ఆకృతి సంస్థ ఆయన పేరు మీద ప్రతి ఏటా అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. మొదటి అవార్డును నటుడు సుమన్‌‌‌‌‌‌‌‌కు ఇవ్వబోతున్నారు. ఆ వివరాలను తెలియజేసేందుకు ఫిలిం చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు.

‘కాంతారావు పేరు మీద అవార్డు ఇవ్వటం గొప్ప విషయం. అలాగే డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రవీంద్రభారతి వేదికగా కాంతారావు శత జయంతి పురస్కార సభను నిర్వహిస్తున్నాం’ అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు రేలంగి నరసింహారావు, పి.సి.ఆదిత్య, ఆకృతి సుధాకర్, కాంతారావు కొడుకు రాజా పాల్గొన్నారు.