4 నెలలుగా జీతాలివ్వలేదు: ‘కంటి వెలుగు’ ఉద్యోగుల నిరసన

4 నెలలుగా జీతాలివ్వలేదు: ‘కంటి వెలుగు’ ఉద్యోగుల నిరసన

జీతాల కోసం సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నారు కంటి వెలుగు పథకం కోసం రిక్రూట్ అయిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం  గతేడాది ఆగస్ట్ 8 నుంచి.. మార్చ్ 31 వరకు తెలంగాణ అంతటా కంటివెలుగు కార్యక్రమం నిర్వహించింది. కంటిచూపు లేని వృద్ధులు, పౌరులకు పరీక్షలు జరిపి అద్దాలు అందించింది. అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించింది. డాక్టర్లు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 4వేల మంది వరకు ఈ పథకం అమలులో రాష్ట్రమంతా తిరిగి పనిచేశారు.

ఐతే… ప్రభుత్వం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని కంటివెలుగు ఉద్యోగులు అంటున్నారు. సెక్రటేరియట్ లో అధికారులను కలిసి తమ గోడు చెప్పుకున్నారు.