మనసును హత్తుకునే కన్యాకుమారి కథ

మనసును  హత్తుకునే కన్యాకుమారి కథ

హీరోయిన్ మధుషాలిని ప్రెజెంటర్‌‌‌‌‌‌‌‌గా గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా సృజన్ అట్టాడ దర్శక నిర్మాతగా రూపొందించిన  చిత్రం ‘కన్యాకుమారి’.  ఆగస్టు 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో మధుషాలిని మాట్లాడుతూ ‘కొత్త టాలెంట్‌‌‌‌ను సపోర్ట్ చేయాలనే ఈ చిత్రానికి ప్రెజెంటర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నా. గీత్ సైని క్యారెక్టర్ చాలా అందంగా ఉంటుంది. ఈ సినిమాతో నేను చాలా పర్సనల్‌‌‌‌గా కనెక్ట్ అయ్యాను’ అని చెప్పింది. 

గీత్ సైని మాట్లాడుతూ ‘ఇది విలేజ్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఉండే యూనిక్ లవ్ స్టోరీ.  మనసును హత్తుకునే అనుభూతిని ఇస్తుంది. ఇందులో కన్యాకుమారి లాంటి  రోల్ వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది.  డైరెక్టర్ సృజన్  మాట్లాడుతూ ‘శ్రీకాకుళం బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ సినిమా ఉంటుంది.  

నేచురల్ క్యారెక్టర్స్‌‌‌‌తో చేసిన  హై ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ఇది. రియల్ ఎమోషన్స్ ఉంటాయి’ అని అన్నాడు.  మ్యూజిక్ డైరెక్టర్ రవి, ఎడిటర్ నరేష్, కో ప్రొడ్యూసర్స్ అప్పలనాయుడు, సతీష్ రెడ్డి పాల్గొన్నారు.