ఆగస్టు 27న విడుదలకు సిద్ధంగా కన్యాకుమారి

ఆగస్టు 27న విడుదలకు  సిద్ధంగా కన్యాకుమారి

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా సృజన్ అట్టాడ దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘కన్యా కుమారి’. నటి మధు శాలిని ఈ చిత్రానికి ప్రెజెంటర్‌‌‌‌గా వ్యవహరిస్తోంది. రూరల్ లవ్‌‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను గణేష్ చతుర్ధి సందర్భంగా ఆగస్టు 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  

రిలీజ్ డేట్ పోస్టర్‌‌‌‌లో  శ్రీచరణ్..  గీత్ సైనీని ప్రేమగా ఎత్తుకుంటూ, ఆమె చేతులకు సీతాకోకచిలుక రెక్కలు అలంకరించినట్టుగా డిజైన్ చేయడం ఆకట్టుకుంది. ‘అన్ ఆర్గానిక్ లవ్‌‌స్టోరీ’  ట్యాగ్‌‌లైన్‌‌తో ఈ చిత్రం రాబోతోంది.  శ్రీకాకుళం బ్యాక్‌‌డ్రాప్‌‌లో  రియలిస్టిక్‌‌గా నడిచే ఈ ప్రేమకథ ప్రేక్షకులకు కొత్త ఫీల్‌‌ని కలిగిస్తుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.  రవి నిడమర్తి సంగీతం అందిస్తున్నాడు.