- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా కరీంనగర్‌ను తీర్చిదిద్దుకుందామని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్‌లో సీపీ గౌష్ ఆలంతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నిబంధనల్ని పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చన్నారు. రోడ్డు పోలీస్, మున్సిపల్, హైవే అథారిటీ, ఆర్అండ్‌బీ, ఆర్టీసీ అధికారులంతా సమష్టిగా ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు.
అనంతరం పవర్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఏసీపీలు విజయకుమార్, వెంకటస్వామి, శ్రీనివాస్, యాదగిరిస్వామి, సీఐలు, ఎస్సైలు, ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.
