ఎంపీగా బండి సంజయ్.. కరీంనగర్కు ఒక్క పైసా తేలేదు : వినోద్ కుమార్

ఎంపీగా బండి సంజయ్.. కరీంనగర్కు ఒక్క పైసా తేలేదు : వినోద్ కుమార్

జగిత్యాల: బండి సంజయ్ ఎంపీ అయ్యాక.. ఐదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకురాలేదన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. 2014లో ఎంపీ గా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రైల్వే లైన్ తీసుకొచ్చానని  చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు వినోద్ కుమార్. కథలాపూర్ మండలం తక్కలపల్లి, తండ్రియాల్ గ్రామాల బీఆర్ ఎస్ కార్యక్రల సమావేశం పాల్గొన్నారు వినోద్ కుమార్. 

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నది ఉన్నది ఊడగొట్టేందుకు కాదు.. గ్రామాల్లో ప్రతి రోజు ఐదారు సార్లు కరెంట్ తీస్తున్నారని వ్యవసాయ బావుల వద్ద మోటార్లు కాలి పోతున్నాయని రైతులు వాపోతున్నారని వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాక ముందు ఉన్న పరిస్థితులను ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్నారని ఆరోపించారు. 

కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తానన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఇచ్చిన కరెంటును కట్ చేయడమేనా.. పంట పొలాలకు నీరందకుండా చేయడమేనా అని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగితే విచారణ చేసి తప్పు చేసిన వారిని శిక్షిస్తూనే..  మరమ్మతులు చేపట్టి కాపర్ డ్యాం నిర్మాణం చేసి రైతులకు నీళ్లు అందించాల్సింది.. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంతో  చెరువులు, కుంటలు ఎండిపోయి ప్రస్తుతం యాసింగి పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. 

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది.. వందరోజులు గడిచాయి ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం.. మహిళలకు బస్సుల్లో ఫ్రీ పథకం తప్పా మిగతా ఏ గ్యారెంటీలు అమలు కాలేదని కరీంనగర్ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు.