
- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని వివిధ ప్రభుత్వ స్కూళ్లల్లో నిర్వహిస్తున్న ప్రీ ప్రైమరీ కేంద్రాల్లో పిల్లల నమోదును పెంచాలని, ప్రతి కేంద్రంలో 20 మంది పిల్లలు తగ్గకుండా అడ్మిషన్లు ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎంఈవోలు, ఎంపీడీవోలు, సీడీపీవోలతో కలెక్టర్ రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో 20 ప్రీప్రైమరీ సెంటర్లలో పిల్లల నమోదు తక్కువగా ఉందన్నారు. వారంలోగా ప్రతి కేంద్రంలో 20 మంది పిల్లలను నమోదు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో మొండయ్య, డీడబ్ల్యూవో సరస్వతి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, పాల్గొన్నారు.
271 దరఖాస్తులు స్వీకరణ
కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 271 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రజావాణి అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం యునిసెఫ్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. యునిసెఫ్ సహకారంతో రానున్న రోజుల్లో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జిల్లాలో చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు, యూనిసెఫ్ వాష్ స్పెషలిస్ట్ వెంకటేశ్ పాల్గొన్నారు.