భూభారతి సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి

భూభారతి సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి

సైదాపూర్​, వెలుగు:   భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కరీంనగర్​ కలెక్టర్​పమేలా సత్పతి అధికారులకు సూచించారు.   భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలోని పైలట్ మండలంగా ఎంపికైన సైదాపూర్లో  ఆమె బుధవారం పర్యటించారు.  రాయికల్, ఎక్లాస్​పూర్​గ్రామాల్లో  రెవెన్యూ సదస్సుల్లో ఆమె పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి  సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.  భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి,  రైతుల సందేహాలను నివృత్తి చేశారుగ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.  

రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.  భూ భారతి పోర్టల్ ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో కూడా అప్లై చేసుకోవచ్చన్నారు.  పైలెట్ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో  సదస్సులు పూర్తయ్యాక, జిల్లాలోని అన్ని మండలాల్లో  రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. భూభారతి సదస్సుల్లో పాల్గొని అవగాహన పెంచుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్లు కనకయ్య, శ్రీనివాస్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

పిల్లల్ని చట్టబద్ధంగానే దత్తత తీసుకోవాలి

కరీంనగర్ టౌన్, వెలుగు: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహలో పెరుగుతున్న 5 నెలల ఆడ శిశువును కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో లో బుధవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హైదరాబాద్ కు చెందిన పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రక్త సంబంధీకుల నుంచి కూడా చట్టబద్ధమైన దత్తత తప్పనిసరి అన్నారు.  ఇందుకు భగత్ నగర్ లోని  జిల్లా  సంక్షేమ అధికారి ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ సరస్వతి, సీడబ్ల్యూసీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ ధనలక్ష్మి, డీసీపీఓ పర్వీన్, పీఓ తిరుపతి, శిశు గృహ మేనేజర్ తేజస్విని,తదితరులు  పాల్గొన్నారు.