కరీంనగర్ టౌన్: సీఎం రాకకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

కరీంనగర్ టౌన్: సీఎం రాకకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్​లో నిర్మించిన కొత్త కలెక్టరేట్‌‌‌‌ భవనాన్ని ప్రారంభించేందుకు ఈనెల 30న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, రాష్ట్రంలోనే మోడల్ గా నిలిచేలా చూడాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో సీపీ గౌస్ ఆలంతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకుని అమలు చేయాలన్నారు.

వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌‌‌‌, పార్కింగ్‌‌‌‌, మైక్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌, ప్రెస్‌‌‌‌ గ్యాలరీ తదితర ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్ వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జల కుమారి పాల్గొన్నారు.