నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద విషాధ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడి గల్లంతయ్యాడు. శనివారం (నవంబర్ 01) కుంట్ల రాజశేఖర్ రెడ్డి (37) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాజెక్టులో పడి చనిపోవడంతో అటు కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది.
ఖానాపూర్ లో వివాహానికి హాజరైన రాజశేఖర్ రెడ్డి.. తిరుగు ప్రయాణంలో ప్రాజెక్టు చూసేందుకు వెళ్లాడు. ఫోటోలు దిగే క్రమంలో ప్రాజెక్టులో పడి గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో రాజశేఖర్ రెడ్డి కోసం గజఈతగాళ్లతో గాలిస్తున్నారు అధికారులు.
కరీంనగర్ జిల్లా జూలపల్లి సాయికాబి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాజశేఖర్ రెడ్డి SGT గా విధులు నిర్వహిస్తున్నాడు.
