ఆవిర్భావ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు : కరీంనగర్‌‌‌‌ కలెక్టర్ చిత్రా మిశ్రా

ఆవిర్భావ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు : కరీంనగర్‌‌‌‌ కలెక్టర్ చిత్రా మిశ్రా
  • కరీంనగర్‌‌‌‌ కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ టౌన్, వెలుగు: జూన్ 2న జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలని కరీంనగర్‌‌‌‌ కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు, నిర్వహణపై బుధవారం కలెక్టరేట్‌‌లో జిల్లా ఆఫీసర్లతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌‌లో నిర్వహించనున్న వేడుకలకు సీటింగ్ ఏర్పాట్లు,  ఇతర అన్ని కార్యక్రమాలు ప్రొటోకాల్‌‌కు అనుగుణంగా పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. 

సీపీ గౌష్‌‌ ఆలం మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్,  జిల్లా వెటర్నరీ ఆఫీసర్‌‌‌‌ లింగారెడ్డి, ఆర్డీవో  మహేశ్వర్, డీసీపీ వెంకటరమణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, డీపీవో జగదీశ్వర్, మెప్మా పీడీ స్వరూపరాణి, డీఎంహెచ్‌‌వో వెంకటరమణ, డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి పాల్గొన్నారు.