కరీంగనర్ సిటీ, వెలుగు: వినాయక నిమజ్జనానికి నీటి విడుదలపై బీజేపీ ధర్నా పేరుతో డ్రామా చేసిందని కరీంనగర్ సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. చింతకుంటలో నిమజ్జన ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనానికి నీటి విడుదలపై మంత్రులు వారం రోజులుగా మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు.
నీటిని విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నాకే బీజేపీ ధర్నా పేరుతో డ్రామా చేసిందని విమర్శించారు. తాము ధర్నా చేసిన ఐదు నిమిషాల్లో నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రులు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారని తెలిపారు.
